మొత్తానికి ఏపీలో అడుగుపెడుతున్న పవన్ ? ఎందుకంటే ? 

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఏపీ పై కరుణ చూపిస్తున్నట్టు గా కనిపిస్తున్నారు. కరోనా ప్రభావం ఏపీలో మొదలైనప్పటి నుంచి ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలోనే వరుసగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ,  హైదరాబాదులోనే ఉండిపోయారు. దీంతో జనసేన పైన రాజకీయంగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ రెండు పడవలపై కాళ్లు వేశారని, ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టం అనే అభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్ని విమర్శలు వచ్చినా , పవన్ మాత్రం ఏపీకి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడలేదు. ఈ విషయంలో జన సైనికులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఆ సమయంలో పవన్ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై ప్రజా సమస్యల విషయంలో  విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రత్యక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు అంటూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
అలాగే అమరావతి నుంచి పవన్ పక్కకు తప్పుకున్నారు అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విమర్శ గట్టిగా సమాధానం చెప్పాలి అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఈ నెల 17 18 తేదీల్లో ఏపీలో అడుగు పెట్టబోతున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది. రెండు రోజులపాటు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీలో కీలక నాయకులతో సమావేశం కాబోతున్నట్టు ప్రకటించింది. 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఇచ్చాపురం, రాజోలు ,మంగళగిరి ,నెల్లూరు రూరల్ ,అనంతపురం నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులతో పవన్ భేటీ అవుతారని , అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లా ల నాయకులతో భేటీ అవుతారని ప్రకటించారు.
అలాగే ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతల తొనూ, అమరావతికి చెందిన మహిళ రైతులతో పవన్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు అని ప్రకటించింది.అలాగే ముప్పై రెండు నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వం, ఆ నియోజకవర్గ ఇన్చార్జి తో 18వ తేదీ ఉదయం 11 బేటీ కాబోతున్నట్లు జనసేన ప్రకటించింది. త్వరలోనే తిరుపతి పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలవుతున్న నేపథ్యంలో పవన్ ఇప్పుడు ఏపీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news