మ‌ల‌యాళం లోకి మంచు ల‌క్ష్మి

-

టాలీవుడ్ అగ్ర హీరో మంచు మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి మ‌ల‌యాళం ఇండ‌స్రీ లోకి ఆడుగు పెడుతుంది. మ‌ల‌యాళ అగ్ర హీరోల‌లో ఒక్క‌రు అయిన మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర లో తెర‌కెక్కుతున్న ఒక సినిమా లో మంచు ల‌క్ష్మి న‌టిస్తుంది. ఆ సినిమా టైటిల్ మాన్ స్టార్ అని ఇప్ప‌టికే చిత్ర బృందం ఖ‌రారు చేసింది. అయితే మంచు ల‌క్ష్మి మోహ‌న్ లాల్ మాన్ స్టార్ సినిమా లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ మాన్ స్టార్ సినిమా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది.

అయితే ఈ థ్రిల్ల‌ర్ క‌థ ను విన‌గానే మంచు ల‌క్ష్మి ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కు వైశాఖ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. కాగ ఇప్ప‌టి కే మాన్ స్టార్ సినిమా కు సంబంధించి మోహన్ లాల్ ఫ‌స్ట్ లుక్ కూడా చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ సినిమా లో మోహ‌న్ లాల్ ల‌క్కి సింగ్ అనే పంజాబీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. ఆయ‌న లుక్ కూడా పంజాబీ లాగే డిజైన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version