రెబల్ ఫ్యాన్స్ కు షాక్.. ఆస్పత్రిలో చేరిన కృష్ణం రాజు..!

-

రాధేశ్యామ్ సినిమా విడుదల కాబోతున్న ఈ సమయంలో రెబల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు కు ఆపరేషన్ జరిగింది. ఇటీవల ఆయన ఇంట్లో కాలుజారి పడ్డారు. దీంతో కృష్ణంరాజుకు చిన్న సర్జరీ అవసరం అయింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ మేరకు ఆయనకు ఆపరేషన్ జరిగింది. నిన్న ఆయన డిశ్చార్జ్ కూడా అయినట్లు సమాచారం అందుతోంది.

ఈ సర్జరీలో భాగంగా ఆయన కాలు వేలు తొలగించాల్సి వచ్చింది అని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణంరాజు క్షేమంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. ఇక ఆపరేషన్ నేపథ్యంలో ప్రభాస్… ఒక రోజు మొత్తం ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కృష్ణంరాజు నిర్మాణం లో రాజేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషించారు. ఈనెల 11వ తేదీన రాజ్యం సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో తాను కూడా పాల్గొనాలని కృష్ణంరాజు భావించారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించలేదు. ఇంకా ఈ సినిమా విడుదలైన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version