నటి మంచు లక్ష్మి ప్రతి ఒక్కరికే సుపరిచితమే. లక్ష్మి అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. మోహన్ బాబు కుమార్తెగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి అనేక సినిమాలలో నటిస్తూ విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. మంచు లక్ష్మి తన నటనకు గాను ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సైమా 2025 వేడుకలలను దుబాయ్ లో నిర్వహించారు. ఈ వేడుకలకు మంచు లక్ష్మి హాజరయ్యారు.

లక్ష్మీ సైమా 2025 లో అవార్డు సొంతం చేసుకుంది. అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకు వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న వారిలో మంచు లక్ష్మిపై అసభ్యకరమైన కామెంట్లు చేశారు. దీంతో మంచు లక్ష్మి దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒరేయ్ నా ముందుకు వచ్చి మాట్లాడు రాస్కెల్ ధైర్యం ఉంటే నా ముందుకి రా… టైం సెన్స్ లేదా మీకు రాస్కెల్స్ అంటూ ఫైర్ అయ్యారు ప్రస్తుతం మంచు లక్ష్మికి సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది.