సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పేర్కొన్నారు. తాజాగా మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న సమయంలో మల్లారెడ్డి అక్కడ ఉన్న మీడియా వారితో కాసేపు మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగోలేదని చెప్పాడు. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని మల్లారెడ్డి అన్నారు. ఒకప్పుడు ఏపీలో అమ్ముకొని తెలంగాణలో భూములను కొనేవారు.

ఇప్పుడు తెలంగాణలో భూములను అమ్ముకొని ఆంధ్ర ప్రదేశ్ లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి అంటూ బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని మల్లారెడ్డి అన్నారు. ఇందుకు పీఎం మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి రూ. వేల కోట్లు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడుకు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం మల్లారెడ్డి షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.