మంచు మనోజ్ – మౌనికల పెళ్లి డేట్ లాక్..!

-

సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కోని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలపరంగా.. వ్యక్తిత్వం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్.. వైవాహిక జీవితంలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడని చెప్పాలి. 2015లో తాను ప్రేమించిన అమ్మాయి ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. కానీ రెండు సంవత్సరాలు కూడా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేకపోయారు. ఆ తర్వాత విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.

తర్వాత ప్రణతి రెడ్డి అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడే ఉద్యోగం చేస్తోంది. మరొకవైపు మంచు మనోజ్ 2017లో ఒక్కడే మిగిలాడు సినిమా చేసి దాదాపు 5 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల పాన్ ఇండియా సినిమా అహం బ్రహ్మాస్మి సినిమాని కూడా ప్రకటించారు. కానీ ఇంకా ఈ సినిమా సెట్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది.. రాయలసీమ రాజకీయ నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. భూమా నాగి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డి తో కలిసి భూమా నాగిరెడ్డి సమాధిని సందర్శించిన విషయం తెలిసిందే

అలా మీడియా కంట పడ్డ వీరిద్దరూ ఆ తర్వాత హైదరాబాదులోని గణేష్ మండపానికి కూడా కలిసి వెళ్లడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా కడపలోని అతిపెద్ద దర్గాను దర్శించుకున్న మంచు మనోజ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కొత్త సినిమాలతో మీ ముందుకు రాబోతున్నాను.. అంతేకాదు కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించబోతున్నాను అంటూ మీడియాతో చెప్పాడు. దీంతో మౌనిక రెడ్డిని ఆయన వివాహం చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు అని.. ఫిబ్రవరి 2 వ తేదీన వీరి పెళ్లికూడా జరగబోతోంది అంటూ ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలు ఫేక్ అయితే మంచు మనోజ్ స్పందిస్తే వార్తలకు చెక్ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version