భార్యపై మరోసారి అలాంటి కామెంట్స్ చేసిన మంచు మనోజ్..!

-

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవల రెండో పెళ్లితో తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికను ఆయన వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు , సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది. పెళ్ళి తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిన మనోజ్ ఇటీవల ఒక టీవీ షో కి తన భార్యతో కలిసి హాజరయ్యారు. అలాగే తమ ప్రేమ, పెళ్లినాటి ముచ్చట్లను పంచుకున్నారు.

తాజాగా ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇచ్చిన పార్టీలో కూడా సందడి చేశారు మౌనిక – మనోజ్. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు ఈ బ్యూటీఫుల్ జంట. తాజాగా పెళ్లి తర్వాత మనోజ్ తో దిగిన మొదటి ఫోటోను మౌనిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనికి మనోజ్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. పెళ్లికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందులో తమ వివాహ వేడుకకు సంబంధించిన పలు మధుర జ్ఞాపకాలను పంచుకున్నాడు.

ఇక ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మనోజ్..” ఇలాంటి ప్రేమ జీవితంలో ఎవరికైనా ఒక్కసారి దక్కుతుంది.. నువ్వు నాకోసమే.. ఈ భూమ్మీదకి వచ్చావని నాకు తెలుసు.. నేను ఇప్పటికీ ఎప్పటికీ నీ వాడినే.. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు ” అంటూ తన భార్య పై ప్రేమకు అక్షర రూపాన్ని ఇచ్చాడు మనోజ్ ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో అలాగే పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన చాలామంది ఈ జంట చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version