ఎప్పటికీ నేను నీ వాడినే : మంచు మనోజ్ ఎమోషనల్

-

 

మంచు మనోజ్.. గురించి తెలియని వారుండరు. మంచు కుటుంబంలో మోస్ట్ అగ్రెసివ్ మెన్ గా పేరు సంపాదించుకున్నారు మంచు మనోజ్.. మొదటి నుంచి కాస్త దూకుడుగా ఉండే మనోజ్ రాను రాను మరింత యాంగ్రీ మ్యాన్ గా తయారవుతున్నాడు. చిన్న చిన్న విషయాలు కూడా బయట పెట్టుకోవడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఆయన గ్రహించలేకపోతున్నాడు.

ఈ నేపథ్యంలోనే భూమా మౌనికతో పెళ్లికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో సాంగ్ ను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారే దొరుకుతుంది. నువ్వు నా కోసమే ఉన్నావని తెలుసు. ఎప్పటికి నేను పూర్తిగా నీ వాడినే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించినందుకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. కాగా ‘ఏమ్ మనసో’ అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version