‘మనోజ్ వెడ్స్ మౌనిక’ – మంచు మనోజ్ అధికారిక పోస్ట్

-

భూమా మౌనిక రెడ్డిని ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నట్లు హీరో మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించారు. పెళ్లికూతురుగా తయారైన మౌనిక రెడ్డి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశారు. కాగా, తన సోదరి మంచు లక్ష్మీ నివాసంలో ఈరోజు రాత్రి 8:30 గంటలకు వివాహం జరగనుంది. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరో విషయం ఏంటంటే.. ఈ పెళ్లిని కూడా తన ఇంట్లోనే చేస్తుంది..మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన అన్న మంచు విష్ణు భార్య వెరొణికా రెడ్డి స్నేహితురాలు ప్రణతి రెడ్డిని 2015లో ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు మనోజ్. ఆ తర్వాత బేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version