తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పాటు ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ పదవికి పోటీ చేయడంపై హీరో మంచు విష్ణు బహిరంగా లేఖ రాశారు. తెలుగు సినీ పరిశ్రమ రుణం తీర్చుకునేలా సేవ చేయడమే తన కర్తవ్యమని మంచు విష్ణు లేఖలో స్పష్టం చేశారు. మా నాన్న ‘మా’ అధ్యక్షుడిగా చేసిన సేవలు మరియు అనుభవాలు తనకు మార్గదర్శకాలు అని పేర్కొన్నాడు. గతంలో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశాడు మంచు విష్ణు.
‘మా’ సభ్యుల అవసరాలపై అవగాహన మరియు అనుభవం తనకు ఉందని తెలిపాడు. పెద్దల అనుభవాలు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తానని స్పష్టం చేశాడు విష్ణు. ‘మా’ బిల్డింగ్ ఫండ్‌కి నా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చుతో 25 శాతం అందిస్తానని మాట ఇచ్చానని.. భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశానని.. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలు చేశానని పేర్కొన్నారు మంచు విష్ణు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మేమెంతో రుణ పడి ఉన్నామని తెలిపారు.