ఉదయ్ కిరణ్‌కు తెలంగాణ డీజీపీ పరామర్శ.. సాయం అందజేత

-

ఖమ్మం: లాకప్ డెత్‌కు గురైన మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి
పరామర్శించారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు ఆసుపత్రి‌లో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వ సాయం అందజేశారు. ధైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటానని మరియమ్మ కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరియమ్మ లాకప్ డెత్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ డెత్ బాధాకరమన్నారు. మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. మరో సారి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తు‌లో జరగకుండా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ‌లో ప్రెండ్లి పోలీసింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తు‌లో పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరియమ్మ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున సహాయం అందజేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version