ఆ ముగ్గురిపై వేటు వేసిన శాసన మండలి చైర్మన్…

-

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ ముగ్గురు ఎమ్మెల్సీలపై బుధవారం అనర్హత వేటు వేశారు. తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డి లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారంటూ..ఇటీవలే ఆ పార్టీ  నేతలు మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. దీంతో  వాటిని పరిశీలించిన మండలి ఛైర్మన్‌ ఈ రోజు వారి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.

ఆ ముగ్గురు నుంచి పూర్తి స్థాయి విన్న తర్వాత వారిపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెరాస పార్టీ నియమావళిని ఎవరైన అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ..పార్టీ అధినేత చెప్పకనే చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news