నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. ఏపీ సర్కార్ శుభవార్త..!

-

గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు ఎంతో నష్టాన్ని కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంట ధ్వంసం కావడంతో రైతులందరూ ఆందోళనలో మునిగి పోయారు. పంట బాగా పండాలంటే ఈ ఏడాది అప్పుల ఊబి నుంచి బయట పడతాము అనుకున్న రైతులకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు మళ్లీ అప్పుల ఊబిలోకి నెట్టాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు.

అయితే భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం 113.11 కోట్ల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణ గోదావరి కుందూ నదుల పరివాహక ప్రాంతాల్లో రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించారు. 35 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ లభించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version