రాజమౌళి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మణిరత్నం.. వర్కౌట్ అవుతుందా.?

-

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ 1.. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మొదటి పార్ట్ తో విజయాన్ని అందుకున్న మణిరత్నం రెండవ పార్టుతో ఏ రేంజ్ లో అలరించనున్నాడో చూడాల్సి ఉంది. ఇదిలో ఉండగా తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే రాజమౌళి సెంటిమెంట్ ను మణిరత్నం ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. బాహుబలి 2 కూడా ఇదే డేట్ లో విడుదలై అదరగొట్టింది. దీంతో సెకండ్ పార్ట్ రిలీజ్ విషయంలో మణిరత్నం రాజమౌళి సెంటిమెంట్ నే కాకుండా ఏప్రిల్ 28 సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళను రాబట్టింది. కానీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీనికి ఆ తమిళ నేటివిటీ ప్రధాన కారణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే తమిళంలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. జయం రవి, కార్తీ, విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష లాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.496 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. రికార్డు సృష్టించింది. మరి రెండవ భాగంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అలాగే రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవుతున్న మణిరత్నంకి వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version