లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడగింపు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో గత ఆదివారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ 1 గా మనీష్ సిసోడియాను సిబిఐ పేర్కొంది. అయితే గత ఆదివారం 8 గంటల విచారణ తర్వాత సిబిఐ అధికారులు మనీష్ సిసోడీయాని అరెస్టు చేశారు.

ఆ తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరారు. దీంతో ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నేటితో సిసోడియా కస్టడీ ముగియడంతో మరోసారి కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయన రిమాండ్ ను పొడిగించింది.

విచారణ కోసం రెండు రోజులు కావాలని సిబిఐ అధికారులు కోరగా కోర్టు అంగీకరించింది. విచారణ సందర్భంగా అధికారులు మానసికంగా వేధిస్తున్నారని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని సిసోడియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కోర్టు మరో రెండు రోజులపాటు సిసోడియా కస్టడీని పొడిగించింది. అటు ఈనెల 10వ తేదీన సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version