దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన ఈనెల 20 వరకు జ్యూడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.
అలాగే ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణను మార్చి 10కి వాయిదా వేసింది న్యాయస్థానం. అలాగే సిబిఐ కస్టడీని మరో మూడు రోజులు ( మార్చి 6) వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియాని తీహార్ జైలుకు తరలించారు. ఇప్పటికే వారం రోజులపాటు సిసోడియాను సిబిఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
అయితే నేటితో కోర్టు గతంలో విధించిన ఐదు రోజుల సిబిఐ కస్టడీ ముగియడంతో ఆయనని ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. విచారణకు మరింత సమయం కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మరోవైపు సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆప్ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.