హీరో గౌతమ్ ప్రేమను అంగీకరించలేదంటున్న నాగచైతన్య హీరోయిన్

-

తమిళ వెటరన్ యాక్టర్, సీనియర్ నటుడు కార్తిక్ కుమారుడు హీరో గౌతమ్ కార్తిక్ ప్రేమను అంగీకరించలేదని అంటోంది మంజిమా మోహన్. ఇటీవల కాలంలో వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. సహజీవనం చేస్తున్నారని… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టింది మంజిమా మోహన్. తాను గౌతం ప్రేమను అంగీకరించలేదని కుండబద్దలు కొట్టింది. 

నాజీవితంలో జరిగే కీలక విషయాలను ఎప్పుడూ దాచిపెట్టలేదని.. చిన్న విషయమైనా సరే ఓపెన్ గా వెల్లడించానని అన్నారు. పెళ్లి అనే విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముందని మంజిమా మోహన్ ప్రశ్నించారు. నిజానికి నేను, గౌతం పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు మనస్సును కాస్త బాధించాయిని… ఈ వార్తలు చూసిన తర్వాత నా తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తారో అని భయం వేసిందని… దేవుని దయవల్ల వారు దీన్ని సీరియస్ గా తీసుకోలేదని ఆమె వివరించారు.

గౌతం కార్తిక్, మంజిమా మోహన్ ఇద్దరు తెలుగు తెరకు సుపరిచితమే. మణిరత్నం తీసిన ‘ కడలి’ సినిమా ద్వారా తెరంగ్రేటం చేశాడు గౌతమ్. మంజిమా కూడా తెలుగువాళ్లకు తెలుసు. గౌతంమీనన్ తీసిన ‘ సాహసం శ్వాసగా సాగిపో’ లో నాగచైతన్య పక్కన జోడీగా నటించింది. ఇటీవల వచ్చిన డబ్బింగ్ సినిమా ‘ ఎఫ్ఐఆర్’ సినిమాలో కూడా కనిపించింది మంజిమా మోహన్. వీరిద్దరు కలిసి ‘దేవరత్తం’ సినిమాలో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version