తెలంగాణలో అసెంబ్లీలో సీఎం రేవంత్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మ బంధువు అని సీఎం సంభోదించారు. పదేళ్ల పాటు ప్రధాని హోదాలో అద్భతమైన పరిపాలన అందించారని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా కేవలం పని మీదే ధ్యాస పెట్టారని గర్తు చేశారు.
2013లో భూసేకరణ చట్టం ద్వారా గ్రామాల్లో నిరుపేదలకు సాయం చేశారని, భూమి లేని వారికి కూడా నష్టపరిహారం అందించేలా చట్టం చేశారన్నారు. ఐటీలో ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందంటే అది మాజీ ప్రధాని మన్మోహన్ సరళీకృత విధానమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మ బంధువుని, రాష్ట్రంతో ఆయనకు విడదీయలేని బంధం ఉందన్నారు. ఇక్కడి ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యక స్థానం ఉంటుందని తెలిపారు.