సిద్దిపేట జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జిల్లాలోని ములుగు మండలం దండిగూడెం గ్రామ శివారులోని కొండాపూర్ మార్గంలో ద్విచక్ర వాహనం నుంచి కింద మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతుడు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటి) గ్రామానికి చెందిన చెట్టి పృథ్వీరాజ్‌గా గుర్తించారు.అయితే, తమ కుమారుడిని ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.కాగా, బైకు మీద నుంచి అదుపుతప్పి పడిపోయి మరణించాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న దాని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.