మ‌న్మోహ‌న్ సింగ్ హెల్త్ అప్డేట్..!

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ అనారోగ్యంతో బుధ‌వారం సాయంత్రం ఆస్ప‌త్రిలో చేరారు. జ్వ‌రం, నీర‌సం లాంటి ల‌క్ష‌ణాల‌తో మ‌న్మోహ‌న్ సింగ్ ఆస్ప‌త్రిలో చేర‌గా వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందించారు. అయితే మ‌న్మోహ‌న్ సింగ్ కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆయ‌న డెంగ్యూ భారిన ప‌డిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. అయితే చికిత్స అనంత‌రం ఆయ‌న ఆరోగ్యం కోలుకుంద‌ని వైద్యులు నిర్ధారించారు. శ‌నివారం సాయంత్రం ఓ వైద్యాధికారి మ‌న్మోహ‌న్ సింగ్ ఆరోగ్యంపై హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ప్లేట్ లెట్స్ కౌంట్ పెరిగిందని ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే మ‌న్మోహ‌న్ సింగ్ ను చూసేందుకు కేంద్ర ఆరోగ్య‌మంత్రి మ‌న్షుక్ మండ‌వీయ ఆస్ప‌త్రికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఓ ఫోటో గ్రాఫ‌ర్ ను కూడా వెంట తీసుకెళ్లారు. మ‌న్మోహ‌న్ సింగ్ భార్య ఫోటో గ్రాఫ‌ర్ రావ‌డం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఆయ‌న భ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ విష‌యాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ కూతురు దామ‌న్ సింగ్ చెబుతూ..నా త‌ల్లి దండ్రులు ఏమైనా జూలో జంతువులా…ఫోటో గ్రాఫ‌ర్ ను తీసుకుని వ‌చ్చేందుకు అని ఫైర్ అయ్యారు.