ప‌వ‌ర్ స్టార్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో పొలిటిక‌ల్ డ్రామా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతుంద‌ని టాలీవుడ్ లో వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. శేఖ‌ర్ క‌మ్ముల రానా హీరోగా లీడర్ సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రానా సీఎం పాత్ర‌లో ఆక‌ట్టుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని శేఖ‌ర్ క‌మ్ముల‌, రానాల కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రియు శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలోనూ ఓ పొలిటిక‌ల్ డ్రామా తెరకెక్క‌బోతున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అంతే కాకండా ఈ సినిమా లీడ‌ర్ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రానాకు బ‌దులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను హీరోగా తెర‌కెక్కిస్తార‌ని టాక్. మ‌రో వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డేలా ఈ సినిమా క‌థ‌ను రెడీ చేస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటూ వెయిట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా శేఖ‌ర్ క‌మ్ముల చైతూ సాయిప‌ల్లవి హీరో హీరోయిన్ లుగా ల‌వ్ స్టోరీ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.