ముదిరిన పూసపాటి వారసుల వర్గ పోరు..మౌన దీక్షకి దిగిన ఊర్మిళా…!

-

పూసపాటి రాజవంశం పరువు కాస్తా మంటగలిసిపోతోంది. వందల ఏళ్ల గజపతిరాజుల చరిత్ర మసక బారిపోతోంది. రోజుకో వివాదంతో రాజవంశ వారసులు రోడ్డెక్కుతున్నారు. వారసత్వ పోరులో ఒకరిపై ఓకరు కత్తులు దూసుకుంటున్నారు. పూసపాటి ఇంటి ఆడపడుచు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సాక్షిగా మరోసారి పూసపాటి వారసుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.సిరిమానోత్సవం సందర్భంగా వీళ్ల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి.

మాన్సాస్ బాధ్యతలు చేపట్టాక మొదటిసారి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు సంచయిత. సిరిమానోత్సవాన్ని వీక్షించేందుకు తాను కూర్చునే కోట బురుజుపై… ఊర్మిళను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన ఆమె… వారిని పంపించాలని అధికారులను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అవమానంగా భావించిన ఊర్మిళా, ఆమె తల్లి సుధ… సిరిమానోత్సవం జరుగుతుండగానే తిరుగుతుండగానే కోట బురుజు దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఊర్మిళ ఘాటుగా స్పందించారు. తన తండ్రి కోసం 20 ఏళ్లు పనిచేసినవారు, తనని చిన్నప్పటి నుంచి పెంచిన వ్యక్తులే కొందరి ఒత్తిడి కారణంగా తమని కోటను విడిచిపెట్టమని కోరారు అంటూ పరోక్షంగా సంచయితాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పీవీజీరాజు కళా వేదిక వద్ద ఊర్మిళా గజపతి రాజు మౌన దీక్షకి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version