ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే సాధారణ సాల్ట్ కి బదులుగా రాక్ సాల్ట్ ని ఉపయోగించుకోవడం మంచిది. ఈ రాక్ సాల్ట్ ని హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు. ఇందులో తక్కువ ఐరన్ ఉంటుంది. అలానే 90% మినరల్స్ ఉంటాయి. పొటాషియం, జింక్ వంటివి కూడా ఉంటాయి. అయితే ఈ రాక్ సాల్ట్ వల్ల చాలా లాభాలు పొందొచ్చు. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీ సమస్య:
సాధారణంగా బీపీ తగ్గినప్పుడు మనం నిమ్మరసం మరియు సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాం. అయితే మామూలు సాల్ట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకని మీరు దానికి బదులుగా రాక్ సాల్ట్ ను ఉపయోగించవచ్చు. బీపీ ని కంట్రోల్ లో ఉంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది హృదయ సంబంధిత సమస్యలు లేకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ కూడా పెరిగి పోకుండా ఉంటుంది.
ఒత్తిడి తగ్గించుకోవచ్చు:
ఈ మధ్యకాలంలో చాలా పనులు, పని ఒత్తిడి వల్ల ఎక్కువగా ఉంటుంది అందుకని ఒత్తిడి లేకుండా ఉండాలంటే రాక్ సాల్ట్ ని తీసుకోండి. రాక్ సాల్ట్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలానే డిప్రెషన్ సమస్య కూడా ఉండదు.
బరువు తగ్గొచ్చు:
ఈ మధ్యకాలంలో ఒబెసిటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని దీనిని ఉపయోగించండి. సాధారణ సాల్ట్ కి బదులుగా రాక్ సాల్ట్ ని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ఎక్స్ట్రా కొవ్వును కరిగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
అదే విధంగా రాక్ సాల్ట్ ని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య, ఆస్త్మా, డయాబెటిస్, స్టోన్స్ వంటి సమస్యలు కూడా ఉండవు. ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. సైనస్ సమస్య కూడా తొలగించుకోవచ్చు ఇలా రాక్ సాల్ట్ ని తీసుకుని ఇన్ని లాభాలను మనం పొందొచ్చు.