పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల పథకాల్ని తీసుకు వస్తూనే వుంది. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అందుకు చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కూడా ఒకటి.
స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కింద కొన్ని పథకాల వడ్డీని పెంచారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీని కూడా పెంచారు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ పథకంలో కేవలం 6.8 శాతం వడ్డీ మాత్రమే ఇచ్చేవారు. కానీ జనవరి 1, 2023 నుండి 7 శాతానికి పెరిగింది.
ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా ఈ స్కీమ్ కింద పొందవచ్చు. ఈ స్కీమ్ ని ఓపెన్ చేసేందుకు మీరు ఏదైనా పోస్టాఫీసు కి వెళ్ళండి. ఏదైనా పథకం లో మీరు డబ్బులు పెట్టాలనుకుంటే ఈ పథకంలో డబ్బులు పెట్టి మంచిగా లాభాలని పొందవచ్చు. కేవలం రూ.1000తో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. రిస్క్ ఏమి ఉండదు కనుక మీరు ఎంత కావాలంటే అంత ఈ స్కీమ్ లో పెట్టుబడి కింద పెట్టచ్చు. పన్ను శాఖలోని సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల తగ్గింపును పొందవచ్చు.
రూ.100, 500, 1000, 5000 సర్టిఫికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. సింగిల్, జాయింట్ A, జాయింట్ B రకం పెట్టుబడిదారులు ఈ పథకంలో డబ్బును ఇన్వెస్ట్ చెయ్యచ్చు. 5 సంవత్సరాల పాటు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ తర్వాత మీకు రూ.14 లక్షలు వస్తాయి. ఒకవేళ రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7 లక్షల వరకు వస్తాయి.