ఆడవారిపై ఎప్పుడు లైంగిక వేధింపులు జరుగుతూనే వస్తున్నాయి ముఖ్యంగా ఇవి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇప్పటికే పలువురు నటులు వేధించబడిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని మీతో పేరుతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున లేవనెత్తారు కూడా ఈ సందర్భంగా పలువురు నటిమలు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని చెప్పుకుంటూ వచ్చారు అంతేకాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఈ విషయం కొనసాగుతూనే వస్తుంది ఇప్పటికే పలువురు హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాలు పంచుకుంటూ వస్తున్నారు అయితే తాజాగా ఓ హీరోయిన్ ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది..
భోజ్ పురి హీరోయిన్ యామిని సింగ్ క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు.. సినీ ఇండస్ట్రీలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానంటూ చెప్పుకొచ్చారు అలాగే భోజ్పురి స్టార్ హీరో పవన్ సింగ్ తనను వేధించారని అతను చెప్పినట్టు వినకపోతే సినిమా నుంచి తొలగిస్తానని అన్నట్టు తెలిపారు..
యామిని సింగ్ తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ… “హీరో పవన్ సింగ్ స్టార్ హీరో అయినప్పటికీ అతనితో కలిసి పని చేయడం నాకు ఇష్టం ఉండదు ముఖ్యంగా ఆయన సినిమాల్లో లేడీ యాక్టర్స్ కు సరైన పాత్రలు ఉండవు అందుకే ఆయన సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు అయితే ఆయన పైకి కనిపించే వ్యక్తి మాత్రం కాదు అతనిలో మరో షేడ్ ఉంది.. పవన్ చాలా మంచి నటుడు అని అతనితో సినిమా చేయటానికి ముందు వరకు అనుకున్నాను. కానీ అతడి నిజ స్వరూపం తర్వాత బయటపడింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రావాలని చెప్పాడు. అయితే రాత్రి అయింది నేను రాలేనని చెప్పాను. దీంతో అతడు.. ‘సినిమా చేయాలని ఉందా? లేదా?’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ‘ఈ చిత్రంలో నువ్వు నటించాలంటే ఇప్పుడు రావాల్సిందే’ అంటూ బెదిరించాడు. ఇంకా తర్వాత నేను కాల్ కట్ చేసి సినిమా నుంచి తప్పుకున్నాను అలాగే పవన్ సింగ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడని అంతా అనుకుంటున్నారు కానీ అది ఎంత మాత్రం నిజం కాదు ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది డైరెక్టర్ అరవింద్ చౌబే వలనే..” అంటూ చెప్పుకు వచ్చింది ఈ హీరోయిన్..