కరోనా వైరస్.. ఇది ఒక్కరికి సోకితే చాలు, ఆ వ్యక్తి నుంచి ఎందరికో సోకుతుంది. అందుకే బోతిక దూరం తప్పనిసరిగా చెప్తున్నారు నిపుణులు. ఇప్పటికే దీనిపై ఎన్నో సందేశాలు వచ్చాయి. ప్రముఖులు సైతం బౌతిక దూరం పాటించమని చెప్తున్నారు. అయితే ప్రజలు కూడా చాలా వరకు దీన్ని పాటిస్తున్నారు. కానీ, ఎక్కడో కొంతమంది మంత్రం దీనిమీద అవగాహన లేకనో ఏమో గాని దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీనివల్ల వల్ల చాలా పెద్ద ప్రమాదమే ఉండి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఏకంగా 222 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. గత నెల 21న జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది.
ఆ తర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పటి వరకు 222 మందికి వైరస్ సంక్రమించింది. ఒక్క మామిడాడలోనే ఏకంగా 119 మంది వైరస్ బారినపడడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే, పెదపూడి మండలంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 125కు పెరిగింది. మామిడాడలో నమోదైన తొలి కేసు ద్వారా రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేటలో 57 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. మామిడాడలో నమోదైన తొలి కేసు ద్వారానే వీరందరికీ సంక్రమించినట్టు అధికారులు పేర్కొన్నారు.