చర్చిలో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం

-

జర్మనీ హాంబర్గ్​లో తుపాకీ మోత విధ్వంసం సృష్టించింది. ఓ చర్చిలో జరిగిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. చర్చిపై కొందరు దుండగులు దాడికి తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా తుపాకీతో కాల్చారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

ఈ దారుణ ఘటన గురువారం సాయంత్రం జరిగినట్లు జర్మనీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటనపై స్థానికంగా ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు పాలస్తీనాలో రద్దీగా ఉండే సెంట్రల్​ అవివ్​ వీధిలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సాయుధుడిని కాల్చి చంపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version