మాంటెనీగ్రో దేశంలో ఘోరం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇందులో ఓ పోలీసు కూడా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అప్పటి వరకు అక్కడే కాల్పులు జరుగుతున్న నిందితుడని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు.
కానీ ఆ దుండగుడు పోలీసులపైనా కాల్పులు జరపడంతో పోలీసులు అతణ్ని కాల్చి చంపారు. నిందితుడు బాల్కన్ ప్రాంతంలోని ఓ చిన్నదేశానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
అంతకుముందు.. భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై న్యూయార్క్లో దాడి జరిగింది. ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగానికి సిద్ధమవుతుండగా.. ఆయన వైపు దూసుకొచ్చిన దుండగుడు స్టేజిపైనే కత్తితో దాడి చేయడం గమనార్హం. ఆయనను ఎయిర్లిఫ్ట్లో ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.