నేడు మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కడంబతో పాటు వరుస ఎన్ కౌంటర్ లను ఖండిస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటి బంద్ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ లోని ప్రాణహిత, పెనుగంగతో పాటు తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. కదంబతో పాటు వరుస ఎన్ కౌంటర్ లను ఖండిస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటి ఈ బంద్ కు పిలుపు నిచ్చింది. అయినా సరే మరో వైపు కడంబ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోల కోసం అడవుల్లో కూంబింగ్ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.
ఇక బార్డర్ లో మాత్రం పోలీసుల హై అలెర్ట్ ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పలిమెల, మహముత్తారం, మహ దేవపూర్ మండలాలతో పాటు, కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు చేస్తున్నారు. అయితే భద్రాద్రిలో మాత్రం మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏజెన్సీ లో పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. మావోలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, చత్తీస్ గడ్ పామేడు ఏరియాలో 25 మంది గిరిజనులను మావోలు హత్య చేశారని వారి కుటుంబాలను అదుకునేది ఎవ్వరని ఆ పోస్టర్లలో ప్రశ్నించారు. ఆదివాసీ కుటుంబాలకు చదువు లేకుండా చేస్తున్నారని ఆ పోస్టర్లలో విమర్శించారు.