WHO అల‌ర్ట్ .. ఆఫ్రికాలో మ‌రో మ‌హ‌మ్మారి.. ఈ వైర‌స్ సోకితే మృత్యేవే

-

గినియా లో మార్బర్గ్ వ్యాధికి సంబంధించి ఒక కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సోమవారం నాడు చెప్పడం జరిగింది. అయితే ఎబోలోకి సంబంధించిన ప్రాణాంతక వైరస్ మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అయితే ఇది కోవిడ్ 19 లాగ వ్యాపిస్తుందని కూడా చెప్తున్నారు.

అదే విధంగా ఇది జంతువుల నుండి మనుషులకు కూడా వ్యాపిస్తుంది అని వెల్లడించారు. అయితే ఈ వ్యాధి కారణంగా ఒక వ్యక్తి ఆగస్టు 2న మరణించడం జరిగింది. ఆ రోగి నుండి సేకరించిన నమూనాల ప్రకారం ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వచ్చినది అని తెలిసింది. 88 శాతం వరకూ మరణాల రేటు ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది

మార్బర్గ్ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేసే అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ Matshidiso Moeti అన్నారు. అయితే నిపుణులు ఎబోలాకి సంబంధించిన వ్యాధి పై కూడా మేము పని చేస్తున్నామని ఇప్పటికే ఈ వైరస్ గురించి డేటాని కలెక్ట్ చేశామని అన్నారు. అయితే ఒకసారి ఈ వైరస్ కనుక సోకితే ఆ తర్వాత ఇది మరొకరికి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా సోకుతుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

Sierra Leone Liberia బోర్డర్లో ఒక మారుమూల గ్రామంలో ఈ కేసు నమోదయ్యింది. అయితే ఈ వ్యక్తికి జూలై 25న వ్యాధి తాలూకా లక్షణాలు కనిపించాయి. లోకల్ క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాక మలేరియా ఉందని వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించాడు. పోస్టుమార్టం రిపోర్ట్ లో అయితే ఎబోలా నెగిటివ్ చూపించింది కానీ మార్బర్గ్ పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులు మరియు తోటి ఉద్యోగస్తుల పైన కాస్త రిస్క్ ఎక్కువగా ఉందని ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా వైద్యులు చూస్తున్నారని చెబుతున్నారు. మొదట హై ఫీవర్ తో ఈ వ్యాధి మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, చికాకు ఉంటుంది. అయితే ఇప్పటికీ ఇంకా ఎటువంటి వాక్సిన్ యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ లేవు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version