పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

-

పెద్ద వాళ్ళు ఉండే ఇళ్లల్లో మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ల బాధ్యత ఇంట్లో వారిదే అని గుర్తుంచుకోవాలి. అందుకోసం పెద్దవాళ్ళకి అవసరానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఆస్తమాను పెద్ద వాళ్ళకి అందుబాటులో మీరు ఉండలేకపోతే ఈ చిన్న చిన్న ఏర్పాట్లను చేసుకోండి. దీనితో పెద్ద వాళ్ళు ఎక్కువగా మీద ఆధార పడకుండా సులువుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అయితే మరి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా ఇంట్లో అన్నీ సర్దుకుంటాం. ముఖ్యంగా పెద్ద వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • టాయిలెట్లు, షవర్స్ దగ్గర హ్యాండ్ రైల్స్ ఏర్పాటు చేసుకోవాలి.
  • అదే విధంగా అవసరమైన చోట్ల వీల్ చైర్స్ లేదా వాకర్‌ కోసం ర్యాంప్‌  ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా మామూలు టాయిలెట్ కి బదులుగా ఒక్కటైనా రైజ్డ్‌ టాయిలెట్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
  • పెద్దవాళ్ళు వుండే గదిలోకి మంచి వెంటిలేషన్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి.
  • టెలిఫోన్ వైరు, ఇంటర్నెట్ వైర్లు కింద ఉండకుండా అడ్డంగా లేకుండా చూసుకోవాలి.
  • అలానే ఇంట్లో ఫర్నిచర్ ని కూడా సరిగ్గా సర్దుకోవాలి. అడ్డంగా ఉంటే వాళ్ళకి తగులుతూ ఉంటుంది కనుక పక్కకి పెట్టుకోండి.
  • సరైన సమయానికి ఆహారం ఇవ్వడం, మందులు ఇవ్వడం లాంటివి చేయాలి.
  • అలానే వాళ్లు చెప్పే మాటలకు విసుక్కోకుండా వాళ్ళతో కాస్త సమయాన్ని గడపడం కూడా ఎంతో మంచిది. ఇలా వాళ్లతో ప్రేమగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version