మార్చి 01 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ మార్చి – 01- సోమవారం. మాఘమాసం.

 

మేష రాశి:సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గృహంలో శుభకార్యాన్ని జరుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. గొప్ప వ్యక్తుల తో గౌరవ మర్యాదలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

పరిహారాలు: ఈరోజు బాలా త్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

 

todays horoscope

వృషభ రాశి:తోటి ఉద్యోగుల వల్ల ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల పనులలో అనుకూలత కోల్పోతారు. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల మీలో ఉన్న సహాయం చేసేవారు దూరమవుతారు. తక్కువ మాట్లాడడం మంచిది. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. సోదరులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి.

పరిహారాలు: శివారాధన చేసుకోండి, దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోండి.

 

మిధున రాశి:పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

కర్కాటక రాశి:రుణ బాధలు తీరిపోతాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. సోదరులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి.

పరిహారాలు: ఈరోజు కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. బంధు మిత్రుల రాక సంతోషపరుస్తుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయట పడి ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన ప్రతి పనిలో ఆదరణ పొందుతారు. అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:మిత్ర లాభం పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉంటారు. మిత్రుల సహకారాలు తీసుకొని పనులు పూర్తి చేస్తారు. మిత్ర లాభం పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనయోగం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో ఆదరణ పొందుతారు.

పరిహారాలు: గణపతి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

తులారాశి:సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నతమైన స్థానాలను పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపార లాభాలు అనుకూలిస్తాయి. అయినా వారి ఆదరణ పొందుతారు. మీ మాట తీరు బాగుండటం వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ప్రశాంతత కలిగి ఉంటారు.

పరిహారాలు: ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:వ్యాపారాలను విస్తరిస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. ప్రయాణ లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. విలువైన బంగారు  ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు.

పరిహారాలు: లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనుస్సు రాశి:సోదరులతో విభేదాలు!

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఒత్తిడి ఏర్పడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో విభేదాలు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు.

పరిహారాలు: శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి:ఉద్యోగస్తులకు ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. మొండి పట్టుదల వల్ల అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం. తల్లిదండ్రుల  మాటలను, సూచనలను పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారాలు: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ప్రయాణాలు కలిసొస్తాయి !

ఈరోజు బాగుంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు.

పరిహారాలు: ఈరోజు షట్పది స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:బకాయిలను వసూలు చేసుకుంటారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు: విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version