మార్చి 09 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం.

మేష రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల అనర్ధాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలించవు. విద్యార్థుల చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేయించుకోండి.

todays horoscope

వృషభ రాశి:స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వాహనాలను, విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి:సోదరుల మధ్య విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు ప్రమాదాలకు దారి తీస్తాయి. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ వహించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. సోదరుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు.
పరిహారాలుః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనలాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

సింహ రాశి:పోగొట్టుకున్న వస్తువులను పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను, డబ్బును తిరిగి పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి అందుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి:తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల మీకు మీరే తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. డబ్బులు ఇవ్వడం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. రహస్యాలు బయటకు చెప్పడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకోకుండా బదిలీ అవుతారు.
పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

తులారాశి:చదువు మీద శ్రద్ధ కోల్పోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. ముఖ్యమైన విషయాల్లో తల్లిదండ్రులను నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
పరిహారాలుః ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి:సంతోషంగా ఉంటారు !

ఈరోజు సంతోషకరం గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి సంతోషంగా ఉంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యత గా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

ధనస్సు రాశి:ఇచ్చిన మాటను నిలబెట్టు కోలేకపోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎదుటి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టు కోలేకపోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి, బీదవారికి వస్త్ర దానం చేయండి.

మకర రాశి:వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. పనిచేసే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తినీ ఆరాధించండి.

కుంభరాశి:పని వత్తిడి పెరుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని వత్తిడి పెరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. తొందరపాటు తనం వల్ల నష్టం. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు. ప్రయాణాలు అనుకూలించవు.
పరిహారాలుః దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మీన రాశి:సంతాన విషయంలో శుభవార్తలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version