వైవాహిక జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుండి వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. అప్పుడు జీవితాంతం ఆనందంగా ఉండేందుకు అవుతుంది. చిన్నచిన్న సమస్యలు పరిష్కరించకపోతే అవి ఎక్కువైపోతు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ ఉండాలి. పార్టనర్ మధ్య గొడవలు కానీ చిన్న చిన్న డిస్కషన్స్ గాని ఉంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే సరిపోతుంది.
ఒక్కొక్కసారి ఇటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మరి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం.
మీ జీవిత భాగస్వామి అబద్ధాలు చెబుతున్నట్లు మీకు అనిపిస్తే ఈ విధంగా సమస్యను పరిష్కరించుకోండి:
ఎప్పుడైనా ఇలా మీకు అనిపిస్తే దీని నుంచి కాస్త బ్రేక్ తీసుకోండి మీరు కాస్త గ్యాప్ ఇచ్చి సమస్యలను డీల్ చేస్తే చల్లగా సమస్యలు పరిష్కారమవుతాయి లేదంటే సమస్య పెద్దది అయిపోయే అవకాశం ఉంది.
మీ కోపాన్ని ఫ్రస్టేషన్ ని పక్కన పెట్టేసి డీల్ చేసుకుంటే మంచిది:
ఒకవేళ కనుక మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తుకు ప్రమాదం. ఏదైనా సమస్య కానీ గొడవ కానీ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి.
సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యము:
ఇలాంటి గొడవలు వగైరా వంటివి వచ్చినప్పుడు మానసిక ఆరోగ్యం పై ఎఫెక్ట్ అవుతుంది. దీనితో మీకు మరింత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీ ఎమోషన్స్ పట్ల మీ మాటల పట్ల జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ కేర్ తీసుకుని ఆలోచనల్ని పక్కన పెట్టేసి రిలాక్స్డ్ గా ఉండండి. ఆలోచనల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం పదే పదే గొడవకు సంబంధించిన ఆలోచనలు రావడం వంటి వాటి వల్ల మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా చేయకండి.
ఇతరుల్ని సపోర్ట్ అడగండి:
మీ వైవాహిక జీవితంలో సమస్యలు కలుగుతుంటే మీరు ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకోండి మళ్లీ సమస్య రాకుండా పరిష్కరించండి. ఇలా ఈ విధంగా మీరు ఉంటే కచ్చితంగా సమస్యలు రాకుండా ఉంటాయి ఇబ్బందుల నుంచి బయట పడడానికి కూడా అవుతుంది.