మర్రి చెన్నారెడ్డి వర్థంతి.. సీఎం రేవంత్ ఘననివాళ్లు

-

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి వర్థంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మర్రి చెన్నారెడ్డి చిత్రపటానికి నివాళ్లు అర్పిస్తున్న ఫోటోను సోషల్ మీడియా ‘ఎక్స్’‌లో స్పెషల్ ట్వీట్ చేశారు. ‘స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ నేత, మాజీ గవర్నర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు’ అంటూ రాసుకొచ్చారు.

ఇదిలాఉండగా, మర్రి చెన్నారెడ్డి మహాత్మా గాంధీ పిలుపుతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగారు. ఉమ్మడి ఏపీకి రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు.అంతేగాక కేంద్రమంత్రిగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా సేవలు అందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ ప్రజాసమితి పార్టీ స్థాపించి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version