జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని (Mars) ‘గ్రహాల సేనాధిపతి’గా పరిగణిస్తారు. కుజుడు ధైర్యం శక్తి, పౌరుషం మరియు ఆవేశానికి కారకుడు. ఏదైనా గ్రహం తన రాశిని మార్చినప్పుడు లేదా స్థితిని మార్చుకున్నప్పుడు దాని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరుణంలో కుజుడి ప్రభావం కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని రాశులకు కష్టకాలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాశులు ఏవి? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి (Gemini):వీరు ముందుగా ఆవేశం తగ్గించుకోవాలి. మిథున రాశి వారికి ఈ సమయంలో కుజుడి ప్రభావం వల్ల మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, తోటివారితో గొడవలు పెట్టుకోవడం వంటివి జరగవచ్చు. దీనివల్ల సామాజికంగా మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు.
సూచన: అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. మాటపై నియంత్రణ కలిగి ఉండటం చాలా ముఖ్యం.
కన్యా రాశి (Virgo): వీరు ఆరోగ్యము ను ముందుగా చూసుకోవాలి. కన్యా రాశి వారికి కుజుడు ప్రతికూల స్థానంలో ఉండటం వల్ల శారీరక ఇబ్బందులు ఎదురుకావచ్చు. రక్త సంబంధిత సమస్యలు, అధిక వేడి లేదా గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
సూచన: వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు.

ధనస్సు రాశి (Sagittarius): ఆర్థిక ఇబ్బందులు వీరి వెంటాడుతాయి. ధనస్సు రాశి వారికి కుజుడి ప్రభావం వల్ల ధన నష్టం లేదా అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అప్పులు ఇచ్చే విషయంలో లేదా తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సూచన: ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ పెద్దల సలహాలు పాటించడం మంచిది.
దుష్ప్రభావాల నివారణకు పరిహారాలు: కుజుడి ప్రతికూలతను తగ్గించుకుని, శుభ ఫలితాలు పొందడానికి ఈ క్రింది పరిహారాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు:
మంగళవారం పూజ: ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేదా అభిషేకం చేయించడం శ్రేయస్కరం.
హనుమాన్ చాలీసా: నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కుజుడి వల్ల కలిగే భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి.
దానధర్మాలు: ఎర్రటి రంగు వస్తువులు (ఎర్రటి వస్త్రం, కందులు) దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది.
గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు గ్రహ సంచారం ఆధారంగా లెక్కించబడినవి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు దశా-అంతర్దశలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.
