మారుతి కొత్త సర్వీసులు… రూ.12 వేలు కడితే కొత్త కారు..!

-

మారుతి కొత్త సర్వీసులని స్టార్ట్ చేసింది. దీనితో కొత్త కారుని కొనాలనుకునే వాళ్ళకి ఊరట కలుగుతుంది. మారుతి సుజుకీ నుంచి సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ బెనిఫిట్ ని ఉపయోగించుకుంటూ మీరు నెలకు కొంత మొత్తం చెల్లించి కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కొత్త సేవలని తీసుకు వచ్చింది.

ఏఎల్‌డీ ఆటోమోటివ్ ఇండియా కంపెనీతో జతకట్టి… సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను మరింత విస్తరించింది. దీని వలన ఎంతో మందికి బెనిఫిట్ కలగనుంది. కొచ్చిలో కూడా ఈ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే మరో 8 పట్టణాల్లో కూడా ఈ సేవలు అందిస్తోంది.. వీటిలో బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణే, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి పట్టణాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. అయితే ఈ సబ్‌స్క్రిషన్ సర్వీసుల్లో భాగంగా వేగనార్, స్విఫ్ట్, డిజైర్, వితారా బ్రెజా, ఎర్టిగా వంటి మోడళ్లను ఎరీనా షోరూమ్స్ నుంచి కస్టమర్లు రెంట్‌కు కూడా తీసుకోవచ్చు.

అంతే కాదండి ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్6, ఎస్ క్రాస్ వంటి మోడళ్లను నెక్సా షోరూమ్‌ నుంచి అద్దెకు తీసుకెళ్లొచ్చు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల కాల పరిమితితో కార్లను ఇంటికి కూడా తీసుకుని వెళ్లొచ్చు. సర్వీసింగ్, మెయింటెన్స్, ఇన్సూరెన్స్, రోడ్‌సైడ్ అసిస్ట్ వంటివి కంపెనీ ఏ చూస్తుంది. కస్టమర్లుc నెలకు రూ.12,513 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు కారును తిరిగి ఇచ్చేయాలి.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version