ఫోటో చూసి.. సాహసమే అనుకుంటున్నారా..!?

-

కొందరి ధైర్య సాహసాలు చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో వాటిని చూసినప్పుడల్లా భయంతో ఒళ్లు గుబురు పడుతుంది. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణానికే ప్రమాదం. పైన కనిపిస్తున్న ఫోటో కూడా అదే కోవకు చెందింది. ఈ ఫోటోలు చూసిన ప్రతి వ్యక్తి షాకవ్వాల్సిందే. శిఖరంపై నుంచి కొంచెం అదుపు తప్పినా ఏకంగా ప్రాణాలే పోతాయి అన్నట్లుగా ఉన్నాయి కదూ. అయితే ఈ ఫోటోని చూస్తే భయపడాల్సిన అవసరమే లేదు. ఫోటో కెమెరా యాంగిల్ మార్చితే సరిపోతుంది. మీరు కూడా శిఖరానికి వేలాడుతున్నట్లు ఫోజ్ ఇవ్వవచ్చు.

photo foze

కెమెరా యాంగిల్ మార్చితే చాలు.. ఎత్తైన కొండపై నుంచి ఫోటో దిగినట్లు ఎలా కనిపిస్తామని అనుకుంటున్నారా..? అయితే, మీరు ఆ శిఖరం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. టర్కీ దేశంలోకి గులేక్ ప్రాంతంలో ఉన్న ఈ శిఖరానికి ఈ మధ్య కాలంలో భారీ క్రేజ్ పెరిగింది. శిఖరానికి వేలాడుతూ కొండ అంచుల్లో కూర్చున్నట్లు దిగుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ప్రతిఒక్కరూ.. ‘‘వీరికి సాహసం ఎక్కువే.’’ అని నోటిపై చేయి పెట్టుకోవాల్సిందే.

ప్రాణాలు రిస్కులో పెట్టి దిగుతున్న ఫోటోలు కేవలం కెమెరా యాంగిల్ ని మార్చడం వల్ల జరిగింది. వాస్తవానికి ఆ శిఖరం చాలా చిన్నది. కాకపోతే ఫోటో తీసేటప్పుడు కెమెరా యాంగిల్ ని కొంచెం డిఫరెంట్ గా మార్చినట్లయితే శిఖరం అంచున కూర్చున్నట్లుగా కనిపిస్తాయి. ఫస్ట్ లో ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురయ్యారు. కొందరైతే తిట్టుకున్నారు కూడా.. కానీ, అసలు విషయం తెలిసిన తర్వాత నవ్వుకున్నారు. దీంతో ఆ ప్రాంతానికి క్రేజ్ పెరిగింది. వేలాది మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి కేవలం ఫోటో దిగడానికి వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version