దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో సర్కార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. సిఎం అరవింద్ కేజ్రివాల్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నాయి. ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా వరుసగా మూడవ రోజు 100 మందికి పైగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 121 మంది మరణించారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు కోవిడ్ -19 కారణంగా 8,391 మంది మరణించారు.
గత 24 గంటల్లో నమోదు అయిన కేసుల సంఖ్య 6,746. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,29,863. అయితే మాస్క్ లేని వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మాస్క్ లేకపోతే ఎవరి నుంచి అయినా సరే కచ్చితంగా రెండు వేలు వసూలు చేయాలని సిఎం కేజ్రివాల్ ఆదేశించారు. నిన్న మొత్తం 1300 మందిని మాస్క్ లేకుండా గుర్తించారు. మాస్క్ లేని బిచ్చగాళ్ళకు ప్రభుత్వమే మాస్క్ లు ఇస్తుంది.