నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. కెన‌రా బ్యాంక్‌లో ఉద్యోగాలు..!

-

బ్యాంకింగ్ రంగంలో రాణించాల‌నుకుంటున్నారా ? అయితే మీకు ఇదే స‌ద‌వ‌కాశం. కెన‌రా బ్యాంక్ త‌మ బ్యాంకులో 220 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నుంది. ఉద్యోగార్థులు ఉత్త‌రాఖండ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఆస‌క్తి ఉన్న వారు న‌వంబ‌ర్ 25 నుంచి డిసెంబ‌ర్ 15 మ‌ధ్య స‌ద‌రు బ్యాంకుకు చెందిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

ఇక ఆన్‌లైన్‌లో ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు ఫీజును జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600గా నిర్ణ‌యించారు. అదే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు అయితే రూ.100 అప్లికేష‌న్ ఫీజు చెల్లిస్తే చాలు.

మొత్తం 220 పోస్టుల్లో భిన్న విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. అడ్మినిస్ట్రేట‌ర్‌, మేనేజ‌ర్‌, డేటా మైనింగ్ స్పెష‌లిస్ట్‌, సైబ‌ర్ ఫోరెన్సిక్ అన‌లిస్ట్‌, ఫ్యాక్ట్ అన‌లిస్ట్‌, చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌, కాస్ట్ అకౌంటెంట్‌, ఎథికల్ హ్యాక‌ర్స్‌, పెనెట్రేష‌న్ టెస్ట‌ర్స్‌, డెవ‌ల‌ప‌ర్‌, ప్రోగ్రామ‌ర్‌, బీఐ స్పెష‌లిస్ట్‌, ఎక్స్‌ట్రాక్ట్‌, ట్రాన్స్‌ఫాం అండ్ లోడ్ ఎక్స్‌ప‌ర్ట్‌, ఎస్‌వోసీ అన‌లిస్ట్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ అన‌లిస్ట్ త‌దిత‌ర పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌లో భ‌ర్తీ చేస్తారు.

పైన తెలిపిన పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థుల‌కు ఉండాల్సిన విద్యార్హ‌త‌లు – గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వారు అప్లై చేయ‌వ‌చ్చు.

వ‌యస్సు ప‌రిమితి – 20 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య అభ్య‌ర్థుల వ‌య‌స్సు ఉండాలి. రిజ‌ర్వేష‌న్ ఉన్న‌వారికి వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఇస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు బ్యాంక్‌కు చెందిన వెబ్‌సైట్ లేదా బ్యాంక్ ఇచ్చిన నోటిఫికేష‌న్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

కెన‌రా బ్యాంక్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ల కోసం 200 మార్కుల‌కు గాను రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష 2 గంట‌లు ఉంటుంది. ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కుల‌ను త‌గ్గిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version