#MaskIndia ఖర్చీఫ్‌ కట్టిన మోడీ.. సందేశమిదే..

-

మన దేశంలో కరోనా వైరస్ వచ్చిన నాటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా వాళ్లను చైతన్య పరుస్తూ మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చప్పట్లు కొట్టమని చెప్పినా, జనతా కర్ఫ్యూ ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పినా, లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించినా సరే మోడీ సామాన్యులను దృష్టిలో పెట్టుకునే చేసారు.

కొవ్వొత్తులు లేదా దీపాలు వెలిగించి కరోనాపై ఐఖ్యత చాటాలని మోడీ ఇచ్చిన పిలుపుకి యావత్ భారత దేశం కదిలి వచ్చింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా దీనిని పాటించారు. విపక్షాలు కూడా మోడీ నిర్ణయాన్ని సమర్ధించాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు మోడీ ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోడీ… సామాన్యులకు అందుబాటులో ఉండే కర్చీఫ్ ధరించారు. మాస్క్ లు లేని వాళ్ళు కట్టుకునేది వాటినే. దానిని మోడీ కట్టుకున్నారు. కొంత మంది రాజకీయ నాయకులు డాక్టర్లు వాడే ఎన్ 95 మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. కాని మోడీ మాత్రం సామాన్యుడి లా కర్చీఫ్ కట్టుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు పొరల వస్త్రం కరోనా వైరస్ మన శరీరంలోకి వెళ్ళకుండా ఆపుతుందని, మోడిని చూసి అయినా సరే అందరూ జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.గుడ్డ మాస్క్‌ వాడండని చెప్పకనే చెప్పారు.. తనే ఆచరించి అందరూ ఫాలో అవ్వాలని చెప్పకనే చెప్పారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version