Mass Jathara Teaser: మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన రవితేజ… ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ హీరోగా చేస్తుండగా శ్రీ లీల మెరుస్తున్నారు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ధమాకా సినిమా బంపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మాస్ జాతరతో… రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మాస్ జాతర సినిమా నుంచి అదిరిపోయే టీజర్ వదిలింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్ లో ఎప్పటిలాగే రవితేజ తన పవర్ఫుల్ పర్ఫామెన్స్ తో దుమ్ము లేపాడు. అటు శ్రీ లీలా కూడా అదరగొట్టేసింది.