బ్రేకింగ్‌ : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి 18 ఫైర్‌ ఇంజన్లు

-

ఢిల్లీలోని వికాస్‌పురిలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వికాస్‌పురిలోని లాల్ మార్కెట్‌లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలను ఆర్పేందుకు 18 ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే వార్తలు అందుతున్నాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతం రాజధాని నగరంలోని అత్యంత సంపన్నమైన ప్రాంతాల్లో ఒకటి.

శనివారం తెల్లవారుజామున 5.50 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించిన ఫోన్‌ కాల్ అందిందని, ఆ తర్వాత 18 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. దుకాణ సముదాయంలోని బేస్‌మెంట్, గ్రౌండ్, మొదటి అంతస్తులో మంటలు చెలరేగుతున్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. మంటలను ఆర్పడానికి ఆపరేషన్ కొనసాగుతున్నది. భారీ అగ్నిప్రమాదం కారణంగా లాల్ మార్కెట్‌ పరిసరాలన్నీ ధట్టమైన పొగతో నిండిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version