గ్రేటర్ హైదరాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం అర్థరాత్రి దోమలగూడలోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముందుగా కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడిన 10 మంది దొంగలు కుటుంబ సభ్యులను నిర్భంధించినట్లు సమాచారం. అనంతరం లాకర్‌లో భద్రపరిచిన 2.5 కిలోల బంగారం, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అపహరించుకుపోయారు.
దొంగతనం చేసినప్పుడు సీసీ ఫుటేజీని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు.దొంగల దాడిలో ఇంటి యజమాని రంజిత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బాధిత బంగారం వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభింనట్లు తెలుస్తోంది. దోపిడీ దొంగలు గురించి
స్థానికంగా ప్రచారం జరగడంతో అక్కడి ఇరుగుపొరుగు భయాందోళనకు గురవుతున్నారు.