తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.పూండి, చెంబరబాక్కం రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయినట్లు తెలుస్తోంది. వర్షాల ధాటికి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
చెన్నై, మదురై,సేలం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.జలపాతాల వైపు పర్యాటకులకు అనుమతి నిరాకరించారు.వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సంస్థలు సూచించాయి.