భారీగా పెరిగిన వెండి ధ‌ర‌లు ! ఎంతంటే?

-

ఈ మ‌ధ్య కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు హెచ్చు త‌గ్గులు బాగా జ‌రుగున్నాయి. కాగ ఈ రోజు వెండి ధ‌ర‌లు బ‌గ్గుమ‌న్నాయి. దేశ వ్యాప్తంగా చాలా న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌లు భారీ గా పెరిగాయి. అలాగే కొన్ని న‌గ‌రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

 

మరి కొన్ని ప్రాంతా ల్లో బంగారం ధ‌ర‌ స్వల్పంగా తగ్గింది. అయితే శ‌నివారం రోజు మాత్రం వెండి కొనుగోలు దార‌లు ఈ ధ‌ర‌లు చూసి షాక్ అవుతున్నారు. సాధార‌ణంగా బంగారం క‌న్న వెండి కొన‌డానికి చాలా మంది ప్రాధాన్య‌త ఇస్తు ఉంటారు. వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే వారందిరికీ షాక్ త‌గిలేలా కిలో వెండిపై రూ.1000 నుంచి రూ.1800 వరకు ధ‌ర‌లు పెరిగాయి.

ప‌లు న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌లు ఇలా:
మ‌న హైదరాబా న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ. 68,600
ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజయవాడలో రూ. 68,600 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,300.
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కిలో వెండి రూ.64,300 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.68,600.
కేరళలో కిలో వెండి ధర రూ.68,600 ఉంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,300
బెంగళూరులో కిలో వెండి రూ.64,300 వ‌ర‌కు ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version