మస్తాన్ సాయి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ టెస్ట్ లో మస్తాన్ సాయికి పాజిటివ్ గా నమోదు అయింది.. న్యూడ్ వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు అరెస్టు అయిన కాజాకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఇద్దరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు… లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇక అటు మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీయడమే కాకుండా.. మెడకు ఉరి తాడు బిగించుకుని యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు మస్తాన్ సాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు.