“షకీబ్ కు రాళ్లతో సన్మానం” మాత్యుస్ బ్రదర్ స్ట్రాంగ్ వార్నింగ్ !

-

నవంబర్ 6న బంగ్లా మరియు శ్రీలంక ల మధ్యన జరిగిన మ్యాచ్ లో ఒక వివాదం జరిగిన విషయం తెలిసిందే. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్లేయర్ మ్యాత్యుస్ ను బ్యాటింగ్ చేయడంలో ఆలస్యం చేశాడన్న కారణంతో టైం అవుట్ గా షకిబుల్ హాసన్ అప్పీల్ చేయడంతో వెంటనే ఫీల్డ్ అంపైర్ సైతం అవుట్ గా ప్రకటించాడు. ఇది క్రికెట్ లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొందరు రూల్ ప్రకారం అవుట్ ఇవ్వడం కరెక్ట్ అంటుంటే, మరికొందరు షకిబుల్ హాసన్ అంపైర్ కు వెనక్కు తీసుకోమని చెప్పి ఉంటే మ్యాత్యుస్ అవుట్ అయ్యేవాడు కాదు, షకీబ్ స్పిరిట్ లేకుండా ప్రవర్తించాడు అంటూ ఏకిపారేస్తున్నారు. ఇక తాజాగా ఏంజిలో మ్యాత్యుస్ బ్రదర్ ట్రెవిన్ మ్యాత్యుస్ షకిబుల్ హాసన్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు..

శ్రీలంక వస్తే రాళ్లతో సన్మానం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు, సీనియర్ ప్లేయర్ అయి ఉండి పూర్తిగా క్రీడా స్ఫూర్తిని మరిచి వ్యవహరించారు అంటూ కామెంట్ చేశారు ట్రెవిన్ మ్యాత్యుస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version