మీడియా ప్రతినిధుల తప్పు లేదు : మంచు మనోజ్

-

జల్‌పల్లిలో తన ఇంటి వద్ద జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడి గురించి తాజాగా మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిస్సహాయ స్థితిలో నేను మీడియాను లోపలికి తీసుకెళ్లాను.మా ఇంట్లోకి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లాను.లోపలికి వెళ్లాక సడన్‌గా వచ్చి దాడి చేశారు. ఇందులో మీడియా తప్పు ఎంత మాత్రం లేదు. కాగా, మోహన్‌ బాబు, మంచు మనోజ్‌కు మధ్య జరిగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.

మంచు ఫ్యామిలీ గొడవలను ప్రశ్నించేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు.ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. మోహన్ బాబు దాడి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news