జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై కేసు పెట్టిన హీరోయిన్..!

-

సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండే మీరా చోప్రా…ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన హీరో ఎవరని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా..మహేష్ బాబు అని మొహమాటం లేకుండా చెప్పింది.. అయితే మరి ఎన్టీఆర్ సంగతి ఏంటని మరో నెటిజన్ అడగ్గా… తాను ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కాదని.. ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులకు కోపం వచ్చింది. దీంతో మీరా చోప్రాపై అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ పెడుతూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. పచ్చి బూతులతో రెచ్చిపోయారు. కాగా, దీనిపై ఎన్టీఆర్ స్పందించాలని ఇప్పటికే ఆమె ట్విట్టర్‌లో కోరింది. అయితే ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. దాంతో తనను వేధిస్తున్న నెటిజన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్‌ ద్వారా పోలీసులను కోరారు. తనను దూషిస్తూ కొందరు చేసిన ట్వీట్లను ఆమె పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లను గుర్తించి వెంటనే ఆయా అకౌంట్లను తొలగించాలని ట్విట్టర్‌ను కూడా ఆమె కోరారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. #WeSupportMeeraChopra హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version